Telugu News » Konda Surekha : జాతరలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ప్రభుత్వం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి..!!

Konda Surekha : జాతరలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ప్రభుత్వం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి..!!

గతం కంటే ఇప్పుడు జరిగే జాతరలో మెరుగైసన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. అదీగాక జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు, ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి.. దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు..

by Venu

ఐనవోలు జాతరకు (Ainavolu Jatara) వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. 2024 లో జరిగే ఐనవోలు మల్లికార్జున జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఐనవోలు, ప్రభుత్వం కొమురవెల్లి జాతర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు..

Konda Surekha: White paper should be released on past government leaders: Minister Konda Surekha

ఈ సమావేశానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఐనవోలు జాతర సంక్రాంతికి మొదలై ఉగాది వరకూ జరగనున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలి వచ్చే ఈ జాతరని.. మూడు నెలల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకు గాను అంతరాయం లేని కరెంట్ సరఫరా, హైమాస్ లైట్ల ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

ఈమేరకు గతం కంటే ఇప్పుడు జరిగే జాతరలో మెరుగైసన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. అదీగాక జాతర స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు, ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన మంత్రి.. దీనిపై త్వరలో ప్రకటన చేస్తామన్నారు.. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. మేడారం, ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న జాతర నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందిని తెలిపారు.

మరోవైపు మేడారం జాతర సవ్యంగా జరిగేలా మంత్రి సీతక్క (Sitakka)తో కలిసి పనిచేస్తామన్నారు. భక్తుల క్యూలైన్ల ఏర్పాటు, జాతర ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణపై పై తప్పకుండా శ్రద్ధ వహించాలని అధికారులను కోరారు. వృద్ధులు, మహిళలు, గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్ సైతం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు..

You may also like

Leave a Comment