బంగారం(Gold), వెండి(Silver)ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. మార్కెట్‌లో డిమాండ్ పెరిగేకొద్దీ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. ఇటీవల ధరలు తగ్గుముఖం పట్టినా ఈ వారంలో ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం పసిడి ధరలు(Gold Price) స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మార్కెట్‌లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర శుక్రవారం రూ.61,040 ఉంది. గురువారం కూడా అదేధర ఉంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర గురువారం రూ.55,950 ఉండగా శుక్రవారం వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.55,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండి ఏకంగా రూ.2వేలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో వెండి ధర రూ.78-79 వేలుగా ఉంది.
ప్రధాన నగరాల్లో వీటి ధరలను చూస్తే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంది. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది. చెన్నెలో 22 క్యారెట్ల ధర రూ.56,450 ఉంది. 24 క్యారెట్ల ధర రూ.61,580 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. వెండి ధరలు ఢిల్లీలో రూ.76,700గా ఉంది. ముంబైలో రూ.76,700, చెన్నైలో రూ.79,700, హైదరాబాద్‌లో రూ.79,700గా నమోదు అయ్యింది.