Telugu News » Gold price: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..!

Gold price: భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..!

బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750గా ఉంది.

by Mano

కొద్దిరోజులుగా బంగారం(Gold), వెండి(Silver) ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరగడమే గానీ ఏ మాత్రం తగ్గకపోవడంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. పసిడి ధరలు(Gold price) రూ.62వేలకు చేరువైంది. శుక్రవారం పెరిగిన బంగారం ధరలు నేడు అదే బాటలో నడిచాయి.

gold

బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,750గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్‌లో ఈరోజు ఉదయం నమోదైనవి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900గా ఉంది. చెన్నెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,180గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,750గా కొనసాగుతోంది.

మరోవైపు నేడు వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ.74,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ.700 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ.74,100లు ఉండగా.. చెన్నెలో రూ.77,000గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,000గా కొనసాగుతోంది.

You may also like

Leave a Comment