మొన్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు(Gold Prices) భారీగా పెరిగిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరల్లోనూ ఆదివారం భారీ పెరుగుదల కనిపించింది. తులం బంగారంపై ఏకంగా రూ.320 వరకు పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,290కి చేరింది. వెండి ధర(Silver Price) మార్కెట్లో అమాంతం రూ.1000కి పెరిగింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,440కి చేరింది. చెన్నెలో ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,290 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.62,290 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఒకే ధరలు ఉన్నాయి. రెండు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,290వద్ద కొనసాగుతోంది.
వెండి విషయానికొస్తే.. ఏకంగా రూ.1000 పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వెండి ధరలో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.80,200గా నమోదైంది. ఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో ఆదివారం కిలో వెండి ధర రూ.77,200గా ఉంది.