పెళ్లిళ్ల సీజన్లో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. కొద్ది రోజులుగా పెరిగిపోతున్న బంగారం(Gold Prices) ధరలు దిగొచ్చాయి. గడిచిన రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే శుక్రవారం (నేడు) బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అటు వెండి ధర(Silver Price) మాత్రం పెరిగిపోయింది.
ప్రస్తుతం తులం బంగారంపై రూ.50 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ. 56,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూస్తే.. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,120 వద్ద కొనసాగుతోంది.
అదే ముంబై, బెంగళూరు, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,970గా ఉంది. అటు చెన్నెలో 22 క్యారెట్ల ధర రూ.57,350గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,550 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా.. వెండి ధర మాత్రం పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై రూ.200 పెరిగింది. ఢిల్లీ, ముంబై, కోల్కత్తాలో కిలో వెండి ధర రూ.76,200గా ఉంది. చెన్నెలో రూ. 79,200 వద్ద వెండి ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 75,000గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విజయవాడ, విశాఖపట్నం, కేరళలో కిలో వెండి ధర రూ.79,200 ఉంది.