ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి(Gold) ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభం తెలెత్తిన సమయంలో దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంగారం నిల్వలు(Gold Reserves) ఎంతగానో తోడ్పడతాయి. అలాంటి బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
మరోవైపు పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం నిల్వలకు డిమాండ్ పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి ప్రాథమిక సురక్షిత ఆస్తిగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ, బంగారం నిల్వలు దేశం క్రెడిట్‌ను, మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఫోర్బ్స్ కథనం ప్రకారం… భారత్ 801 టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచంలో 9వ స్ధానంలో ఉంది. అమెరికా- 8133 టన్నుల బంగారం నిల్వలు. జర్మనీ- 3352 టన్నులు, ఇటలీ- 2451 టన్నులు, ఫ్రాన్స్- 2436 టన్నులు, చైనా- 2191 టన్నులు, రష్యా- 2332 టన్నులు, స్విట్జర్లాండ్- 1040 టన్నులు, జపాన్- 845 టన్నులు, ఇండియా- 801 టన్నులు, నెదర్లాండ్స్- 612 టన్నులు.
అయితే, దేశాలు బంగారం నిల్వలను పెంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో బంగారాన్ని నిల్వ చేయడం ద్వారా తమ దేశాలు ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి.