Telugu News » TRAIN TICKETS : ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇకపై ఒక్క క్లిక్‌తోనే ఎక్కడికైనా టికెట్స్ బుకింగ్!

TRAIN TICKETS : ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త.. ఇకపై ఒక్క క్లిక్‌తోనే ఎక్కడికైనా టికెట్స్ బుకింగ్!

ప్రయాణికులకు రైల్వేశాఖ(Indian Railways) శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్కుల్లో(World largest railway Network) భారత్ ప్రథమస్థానంలో ఉంటుంది. కానీ, ఇక్కడి జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. దేశంలో చాలా మంది రైల్వేల్లో ప్రయాణిస్తుంటారు. అందుకు కారణం ప్రయాణ చార్జీ తక్కువగా ఉండటమే.

by Sai
Good news for the passengers of the Railway Department.. From now on booking tickets anywhere with just one click!

అందుకే మిడిల్ క్లాస్, పేదప్రజలతో పాటు అప్పర్ మిడిల్ క్లాస్ వారు కూడా రైల్వేలపైనే ఆధారపడుతున్నారు. అందుకే రైళ్లల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఎన్ని కొత్తగా ఎన్ని ట్రెయిన్స్ తీసుకొచ్చిన సరిపోవడం లేదు. టికెట్స్ బుక్ చేసుకుందామంటే నెలల పాటు వెయింట్ చూపిస్తోంది.

ఇక కౌంటర్లో నిలబడి టికెట్స్ తీసుకోవడం ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారింది. అందుకే రైల్వేశాఖ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ బుకింగ్ కోసం ఆన్లైన్ సౌకర్యం కల్పించింది. కానీ జనరల్ టికెట్ మాత్రం స్టేషన్‌లోనే తీసుకోవాలి.ఇక UTS యాప్‌లో బుక్ చేయాలంటే రైల్వేస్టేషన్‌కు కేవలం 2 లేదా 3 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండాలి.

తాజాగా UTS(అన్ రిజర్వుడ్ టికెట్ సిస్టమ్)లో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇక UTS యాప్ ద్వారా ఫోన్ లోనే ఎంతదూరమైన టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, స్టేషన్‌కు 50కిలో మీటర్లలోపు ఈ యాప్ పనిచేయదని పేర్కొంది.మొత్తానికి UTS యాప్‌లో మార్పులను ప్రయాణికులకు బెనిఫిట్ కలిగించేలా ఉండటంతో వారు స్వాగతిస్తున్నారు.

You may also like

Leave a Comment