Telugu News » India vs China: భారత్ భద్రతా వ్యవస్థకు చైనా సవాల్.. రహదారి నిర్మాణం..!

India vs China: భారత్ భద్రతా వ్యవస్థకు చైనా సవాల్.. రహదారి నిర్మాణం..!

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని సియాచిన్ గ్లేసియర్‌కు అతి సమీపంలో చైనా కొత్తగా రహదారిని నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ శాఖ నిపుణులు తెలిపారు.

by Mano
India vs China: China's challenge to India's security system.. Road construction..!

భారత్(Bharath) భద్రతా వ్యవస్థకు చైనా(China) సవాళ్లు విసురుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని సియాచిన్ గ్లేసియర్‌కు అతి సమీపంలో చైనా కొత్తగా రహదారిని నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఉపగ్రహ ఆధారిత ఛాయాచిత్రాల ద్వారా భారత రక్షణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ ఫార్వర్డ్ పాయింట్ దగ్గరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గత ఏడాది మార్చి నుంచి రెండుసార్లు వెళ్లి వచ్చారు. ఈ దశలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి డ్రాగన్ కంట్రీ దూకుడు పెంచింది.

India vs China: China's challenge to India's security system.. Road construction..!

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency) తీసిన ఉపగ్రహ చిత్రాలు గత ఏడాది జూన్, ఆగస్టు మధ్య రహదారిని నిర్మించినట్లు చూపుతున్నాయి. ఈ రోడ్డు చివరి భాగం భారతదేశపు ఉత్తర చివరి భాగపు సియాచిన్ గ్లేసియర్లలోని ఇందిర కల్ లేదా ఇందిరా పాయింట్‌ దగ్గర ఉండే పర్వతాల వద్ద 50 కిలో మీటర్ల లోపున ముగుస్తుందని భారత రక్షణ శాఖ నిపుణులు తెలిపారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా కాశ్మీర్‌లో భాగం.

భారత్‌కు కీలకమైన సైనిక స్థావరం. ఈ నిర్మాణం పూర్తిగా భారత్ ప్రాదేశికత సమగ్రతల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దేశ సార్వభౌమాధికారికతను కించపరిచే చర్యగా దీనిని భారత్ పరిగణిస్తోంది. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ ప్రాంతంగా సియాచిన్ గ్లేసియర్స్‌కు పేరు ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భాగంలో సియాచిన్ దగ్గర చేపట్టిన పనులు మౌలిక స్థాయిని దాటి ఇప్పుడు రహదార్ల ఏర్పాటు దిశగా కొనసాగుతున్నాయి.

ఇక, పీవోకేలోని అత్యంత కీలకమైన షక్సగమ్ లోయ దాదాపు 5,300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ మార్గాన్ని 1947 యుద్ధంలో పాకిస్థాన్ స్వాధీనం చేసుకుంది. దీని తరువాత, 1963లో ద్వైపాక్షిక సరిహద్దు ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది. ఇక్కడే ప్రస్తుత మార్గం చైనాలోని జిన్ జియాంగ్ అనుసంధాన హైవే జీ- 219కు మరింత విస్తరణ రహదారి నిర్మాణాలు చేపట్టింది.

You may also like

Leave a Comment