అధికారం దక్కించుకోవాలనే ఆరాటంలో చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తాయి.. అంతేకాకుండా మాట్లాడిన వారినే ఇరుకున పడవేస్తాయి.. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) నేత చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని బీజేపీ (BJP) మండిపడుతోంది. బాధ్యత మరచి మాట్లాడిన మాటలు సమాజానికి చెడు సందేశంగా వర్ణిస్తుంది. ఇక లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

రాహుల్ మగాడో కాదో తెలుసుకునేందుకు ఓ పని చేయండి. అంటూ సెన్సార్ కటింగ్ వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఈ మాటలు తీవ్రమైన తుఫాన్ గా మారి.. రాజకీయ ప్రకంపనాలకు కారణం అయ్యాయి.. ప్రతాప్ దుదత్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ నేతలు ధ్వజమెత్తారు..
కాంగ్రెస్ నేతల ఆలోచనలు వినండి. రాహుల్ గాంధీ మగతనాన్ని కొలిచేందుకు మీ ఇంటి వారిని పంపండంటున్నారని మండిపడుతున్నారు.. ఈ వ్యాఖ్యలు ఎంత నీచం అంటూ.. మరోసారి మహిళలపై తన స్వభావాన్ని కాంగ్రెస్ బయటపెట్టుకొందని ఆరోపణలు గుప్పిస్తున్నారు..