Telugu News » Gujarat : మహిళలపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

Gujarat : మహిళలపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..!

బాధ్యత మరచి మాట్లాడిన మాటలు సమాజానికి చెడు సందేశంగా వర్ణిస్తుంది. ఇక లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

by Venu
Rajasthan: Big shock for Congress.. 32 key leaders join BJP..!

అధికారం దక్కించుకోవాలనే ఆరాటంలో చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తాయి.. అంతేకాకుండా మాట్లాడిన వారినే ఇరుకున పడవేస్తాయి.. ప్రస్తుతం కాంగ్రెస్ (Congress) నేత చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని బీజేపీ (BJP) మండిపడుతోంది. బాధ్యత మరచి మాట్లాడిన మాటలు సమాజానికి చెడు సందేశంగా వర్ణిస్తుంది. ఇక లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

Congress graph down in Malkajigiri.. What is in the report of strategist Sunil Kanugulu?మరోవైపు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం తెలిసిందే.. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ (Gujarat) కాంగ్రెస్ నేత ప్రతాప్ దుదత్ (Pratap Dudat) సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు.

రాహుల్ మగాడో కాదో తెలుసుకునేందుకు ఓ పని చేయండి. అంటూ సెన్సార్ కటింగ్ వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు ఈ మాటలు తీవ్రమైన తుఫాన్ గా మారి.. రాజకీయ ప్రకంపనాలకు కారణం అయ్యాయి.. ప్రతాప్ దుదత్ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ నేతలు ధ్వజమెత్తారు..

కాంగ్రెస్ నేతల ఆలోచనలు వినండి. రాహుల్ గాంధీ మగతనాన్ని కొలిచేందుకు మీ ఇంటి వారిని పంపండంటున్నారని మండిపడుతున్నారు.. ఈ వ్యాఖ్యలు ఎంత నీచం అంటూ.. మరోసారి మహిళలపై తన స్వభావాన్ని కాంగ్రెస్ బయటపెట్టుకొందని ఆరోపణలు గుప్పిస్తున్నారు..

You may also like

Leave a Comment