Telugu News » Gulf Of Aden: కార్గో నౌకపై క్షిపణులతో దాడి.. ముగ్గురు మృతి..!

Gulf Of Aden: కార్గో నౌకపై క్షిపణులతో దాడి.. ముగ్గురు మృతి..!

గ్రీస్‌ యాజమాన్యానికి చెందిన ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ (True Confidence) కార్గో నౌకపై దాడి జరిగింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ (Gulf Of Aden)లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేయగా ముగ్గురు మృతిచెందారు.

by Mano
Gulf Of Aden: Attack on cargo ship with missiles.. Three killed..!

హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్న క్రమంలో యెమెన్‌ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. హమాస్‌కు మద్దతుగా ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు.

Gulf Of Aden: Attack on cargo ship with missiles.. Three killed..!

తాజాగా గ్రీస్‌ యాజమాన్యానికి చెందిన ‘ట్రూ కాన్ఫిడెన్స్‌’ (True Confidence) కార్గో నౌకపై దాడి జరిగింది. ఈ నౌక బార్బడోస్‌ జెండా (Barbados-flagged)తో చైనా నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్తోంది. ఈ క్రమంలో గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ (Gulf Of Aden)లో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులతో దాడి చేశారు.

ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. యెమెన్‌ నగరం ఎడెన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.

ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో సుమారు 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో ముగ్గురు సాయుధ గార్డులు ఉండగా వారిలో భారత్‌కు చెందిన ఒకరు, వియత్నాంకు చెందిన నలుగురు, ఫిలిప్పీన్స్‌కు చెందిన 15 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం తెలిపింది.

You may also like

Leave a Comment