Telugu News » Gun Fire : అమెరికాలో విషాదం.. ఫంక్షన్ లో కాల్పులు..!

Gun Fire : అమెరికాలో విషాదం.. ఫంక్షన్ లో కాల్పులు..!

అప్రమత్తమైన అధికారులు వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్న జెరోమ్.. ఇందులో గాయపడిన బాధితులు అందరూ స్థానిక ప్రాంతంలోనే నివాసముంటారని పేర్కొన్నారు

by Venu
Hyderabad: Honor killing.. Mother who hanged her daughter to death..!

అమెరికా (America)లోని చికాగో (Chicago)లో విషాదం చోటు చేసుకొంది. ఇక్కడ మరోసారి గన్ గర్జించింది.. గుర్తు తెలియని నిందితుల ఘాతుకానికి ఏడేళ్ల బాలిక మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చికాగోలోని బ్యాక్ ఆఫ్ ది యార్డ్స్ పరిసర ప్రాంతంలో ఓ ఫంక్షన్ కి పెద్ద మొత్తంలో జనం హాజరైనట్లు వెల్లడించారు.

Gun fire: Another shooting in America.. 3 dead..!ఈ క్రమంలో ప్రజలంతా గుంపులు గుంపులుగా ఉండగా.. వారిపైకి ఇద్దరు దుండగులు కాల్పులకి తెగబడినట్లు చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ డాన్ జెరోమ్ వెల్లడించారు.. కాగా ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక తలకు బుల్లెట్ తాకగా ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించిందని (Death)పేర్కొన్నారు.. అలాగే మరో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురికి గాయాలైనట్లు తెలిపారు..

ఈ సంఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్న జెరోమ్.. ఇందులో గాయపడిన బాధితులు
అందరూ స్థానిక ప్రాంతంలోనే నివాసముంటారని పేర్కొన్నారు.. మరోవైపు ఈ కాల్పుల (Gun Fire) ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు..

You may also like

Leave a Comment