ఇజ్రాయిల్(Israel) రక్షణ దళాలు హమాస్ ఉగ్రవాదులకు ముచ్చెమటలు తెప్పిస్తున్నాయి. హమాస్(Hamas) ఉగ్రవాదులు తల దాచుకున్న అల్ షిఫా ఆసుపత్రి (Al Shifa Hospital)లోకి ఇజ్రాయెల్ దళాలు దూసుకువెళ్లాయి. స్థానిక ప్రజలను ఆసుపత్రిలో బందీలుగా చేసిన హమాస్‌పై ఐడీఎఫ్ అటాక్ చేస్తోంది. ఆసుపత్రిలో ఉన్న హమాస్ ఉగ్రవాదులందరూ లొంగిపోవాలని ఐడీఎఫ్ ఒక ప్రకటన కూడా జారీ చేసింది.
అల్షిఫా ఆస్పత్రిలోని ఓ ప్రదేశంలో హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ దళాలు పోరాడుతున్నట్లు మిలిటరీ ఓ ప్రకటనలో చెప్పింది. ఇక్కడ నుంచే ఓ కమాండ్ సెంటర్‌ను ఆ ఉగ్రవాదులు నడుపుతున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.
స్థానిక ప్రజలను ఆసుపత్రిలో బందీలుగా చేసిన హమాస్‌పై నెతన్యాహు సైన్యం అటాక్ చేస్తోంది. ప్రస్తుతం గాజాలో ఉన్న ప్రధాన అల్ షిఫా ఆసుపత్రిలోకి ఎంటరయ్యారు. రోగులకు, స్టాఫ్‌కు ఏం జరగకుండా ఉగ్రవాదులను తరిమివేయనున్నట్లు ఇజ్రాయిల్ దళాలు వెల్లడించాయి.హమాస్ ఉగ్రవాదుల చెర నుంచి విముక్తి చేసే లక్ష్యంతో ఐడీఎఫ్ ముందుకు వెళ్తోంది. హమాస్ ఉగ్రవాదులందరూ లొంగిపోవాలని ఐడీఎఫ్ హెచ్చరించింది.
మరోవైపు, ఆసుపత్రిలో దాదాపు 600 మృతదేహాలు ఉన్నాయని, ఖననం చేసే అవకాశం కూడా లేదని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఆల్-షిఫా ఆసుపత్రి శ్మశానంలా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆసుపత్రిలో 1500 రోగులు చికిత్స పొందుతున్నారు. మరో 1500 మంది వైద్య సిబ్బంది, 20వేల మంది వరకు శరణార్థులు ఉన్నట్లు WHO ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మీర్ వెల్లడించారు.