Telugu News » Hanumakonda : ఉద్యోగానికి ఎసరు పెట్టిన లంచం.. సస్పెండ్ అయిన ట్రాఫిక్ ఎస్సై.. వీడియో వైరల్..!!

Hanumakonda : ఉద్యోగానికి ఎసరు పెట్టిన లంచం.. సస్పెండ్ అయిన ట్రాఫిక్ ఎస్సై.. వీడియో వైరల్..!!

లంచం విషయంలో నియమాలు ఎంత కఠినంగా అమలు చేయాలని చూస్తున్న లంచానికి అలవాటు పడిన చేతులు ఊరికే ఉండటం లేదంటున్నారు.. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి లంచం తీసుకొంటూ అడ్డంగా బుక్కైన సంఘటన హనుమకొండ (Hanumakonda)లో చోటు చేసుకొంది.

by Venu

లంచం అనేది నేటికాలంలో సర్వసాధారణంగా మారిందనే ఆరోపణలున్నాయి.. సంపాదనపై ఆశపెంచుకొన్న ప్రభుత్వంలో పనిచేసే కొందరి వల్ల ఆ వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్న సంగతి తెలిసిందే.. అయినా లంచం ముట్టచెప్పనిదే కొన్ని డిపార్ట్ మెంట్లల్లో పనులు కావన్న విషయం జగం ఎరిగిన సత్యం.. జనం తెలుసుకొన్న వాస్తవం అని అంటున్నారు..

లంచం విషయంలో నియమాలు ఎంత కఠినంగా అమలు చేయాలని చూస్తున్న లంచానికి అలవాటు పడిన చేతులు ఊరికే ఉండటం లేదంటున్నారు.. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తి లంచం తీసుకొంటూ అడ్డంగా బుక్కైన సంఘటన హనుమకొండ (Hanumakonda)లో చోటు చేసుకొంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల దగ్గరి నుంచి లంచం తీసుకొంటుండగా కెమెరాకు కంటికి చిక్కాడు సదరు ప్రభుద్ధుడు..

హనుమకొండ ట్రాఫిక్ ఎస్సై (Traffic SI)గా పని చేస్తున్న డేవిడ్ అనే వ్యక్తి.. విధుల్లో భాగంగా.. ములుగు రోడ్ (Mulugu Road) వద్దకు చెకింగ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో బండి పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి, లైసెన్స్ అడిగాడు. ఆ ఇద్దరు లేదని చెప్పడంతో, తనలోని లంచగొండిని బయటకి రప్పించాడు.. డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే ఈ తతంగాన్ని స్థానికంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి ఓ వ్యక్తి వీడియో తీశాడు..

ఆ వీడియోను సోషల్ మీడియా (Social Media)లో పోస్టు చేయడంతో.. క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఆ నోట ఈ నోట విషయం కాస్త వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా దాక వెళ్లింది. అంతే ఆ ట్రాఫిక్ ఎస్సైపై చర్యలకు దిగారు పోలీస్ కమిషనర్.. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు సహకరించిన తోటి సిబ్బంది పై విచారణ చేపట్టారు.

You may also like

Leave a Comment