షర్మిల రాజకీయ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో సంచనాలు సృష్టించింది. అయితే.. గతంలో రాజకీయ నాయకుడిగా హరికృష్ణ లైఫ్ లో జరిగిందే షర్మిల లైఫ్ లో కూడా జరుగుతోందా అని అనిపించక మానదు. కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనిస్తే అందరికి ఇదే అనిపిస్తుంది. షర్మిలకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. ఆమె తన భర్త పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే.. జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ కోసం ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేయడంతో పాటు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు.
అయితే.. ఆంధ్ర ప్రదేశ్ లోనే వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పని చేసిన షర్మిలకు ఆ తరువాత అన్నతో విబేధాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ వదిలి తెలంగాణకు వెళ్లారు. అక్కడ ఆమె సొంతంగా మరో పార్టీని ప్రారంభించారు. అయితే.. తెలంగాణాలో ప్రాంతీయ పార్టీలతో పోరు పడలేకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. తన సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ లోనే చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలతో పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడం అనేది చాలా కష్టమైన విషయమే. కానీ, కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ ను ఎక్కడికో తీసుకెళ్తాను అంటూ చెప్పారు. అందుకు తగ్గట్లే ఆమె తన ప్రయత్నాలు మొదలు పెట్టి అన్నతో వైరాన్ని మరింత పెంచుకున్నారు. ఇదే తరహాలో హరికృష్ణ రాజకీయ జీవితం కూడా ఉంది. రాజకీయాల పట్ల ఆసక్తి లేకున్నా తండ్రి ఎన్టీఆర్ గారు పెట్టిన టీడీపీ పార్టీ కోసం రథసారధిగా మారారు హరికృష్ణ. ఆ తరువాత అధికారం మారి చంద్రబాబు నాయుడు వచ్చిన తరువాత.. చంద్రబాబు నాయుడుతో పొసగక హరికృష్ణ పార్టీ వీడారు. ఆ తరువాత అన్నా టీడీపీ పేరిట సొంతంగా ఓ పార్టీ పెట్టారు. కానీ, 1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ తరువాత దాదాపు ఏడూ సంవత్సరాల తరువాత తిరిగి టీడీపీ చెంతకు చేరారు. చంద్రబాబు, హరికృష్ణ కలిసిపోవడంతో టీడీపీలో ఆయనకు మరింత గౌరవం పెరిగింది కూడా. ఈ సమయంలోనే ఎన్టీఆర్ కూడా తండ్రి మాటమీద టీడీపీ కి మద్దతు ఇచ్చారు. కానీ, ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు. టీడీపీ కి రాజీనామా చేయకున్నా ఆయన ఆ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూనే వచ్చారు. అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం, చేరిన పార్టీలో ఉండలేక బయటకు రావడం, కొత్త పార్టీ పెట్టడం, ఆ పార్టీలు డిజాస్టర్లు అవ్వడంతో తిరిగి పాత చోటుకే చేరడం.. ఇలా హరికృష్ణ లైఫ్ లో జరిగినట్లే షర్మిల లైఫ్ లో కడుదా జరిగిందని అనిపిస్తుంది.