జాతీయ స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు సాధించిన సిద్దిపేట జిల్లా(Siddipet District)పై కాంగ్రెస్ సర్కారు(Congress Government) తీరు బాధాకరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Siddipet mla Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సదాశివపేట(Sadashivapet)లో ఆయన ఆదివారం పర్యటిచారు.
అయ్యప్పస్వామి స్వర్ణాభరణ అలంకరణలో ఆయన రావు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రైతులకు సాగునీటి కోసం రంగనాయక సాగర్‌లోకి నీటిని పంపింగ్ చేయాలని కోరారు. మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.50 టి ఎం సి నీటిని పంప్ చేయాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్ దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట క్లీన్‌సిటీ అవార్డు సాధించేందుకు కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండుగ కావడంతో మున్సిపల్ కార్మికులను నూతన వస్త్రాలతో హరీశ్‌రావు సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు సిద్దిపేటకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు.
దేశంలోని 4,477 మున్సిపాలిటీల్లో పరిశుభ్రతలో సిద్దిపేట 9వ స్థానంలో నిలిచి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. సిద్దిపేటకు ఇంత గౌరవం వచ్చిందంటే మున్సిపల్ కార్మికులు, ప్రజల సహకారమేనని, సిద్దిపేటకు అవార్డు రావడం రాష్ట్రానికే దక్కిన గౌరవమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం, కనీస ప్రశంసలు అందకపోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటకు ఇప్పటి వరకు 23 అవార్డులు వచ్చాయని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.