Telugu News » Betting App Scam: విశాఖలో బెట్టింగ్ యాప్ కేసు కలకలం.. ఇద్దరి అరెస్ట్..!

Betting App Scam: విశాఖలో బెట్టింగ్ యాప్ కేసు కలకలం.. ఇద్దరి అరెస్ట్..!

వైజాగ్‌(Vijag)లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం(Betting App Scam) కలకలం రేపుతోంది. ఈ స్కాంకు సంబంధించి ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది.

by Mano
Betting App Scam: Betting app case in Visakhapatnam.. Two arrested..!

వైజాగ్‌(Vijag)లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం(Betting App Scam) కలకలం రేపుతోంది. ఇక్కడ నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే చత్తీస్‌గఢ్ కేసులో అక్కడి ముఖ్యమంత్రికి ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Betting App Scam: Betting app case in Visakhapatnam.. Two arrested..!

ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను కేంద్రం నిషేధించిన విషయం విధితమే. ఈ కేసు చత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అయితే, తాజాగా వైజాగ్ స్కాంకు సంబంధించి ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది.

అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయలు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకుంది. టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో నితిన్, అమిత్‌లు కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను నితిన్, అమిత్ మళ్లించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది.

బెట్టింగ్ యాప్‌లో వచ్చిన డబ్బుతో నితిన్, అమిత్ విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు తేలింది. ఆ ఆస్తులన్నీ వారి భార్యల పేరుపై ఉన్నాయని గుర్తించారు ఈడీ అధికారులు.

You may also like

Leave a Comment