దేశంలో నేటి రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. రాజకీయం అంటే రాక్షసంగా జనాలకు కీడుచేసే యంత్రాంగం అని ఒక సినిమాలో పరుచూరి గారు చెప్పిన డైలాగులు ప్రజలకు గుర్తుకు వస్తున్నాయంటున్నారు.. ఎందరు నేతలు పదవులను చేపట్టిన..పేదల బ్రతుకుల్లో మాత్రం మార్పులేదని రెక్కాడితే డొక్కాడని గరీబోళ్లు అనుకొంటున్నారు.
ఇక ఎన్నికలు వస్తే ఇచ్చే హామీలకు హద్దు ఉండదు.. మాట్లాడే మాటలకు అంతం ఉండదు.. ఇది నేటి కాలపు రాజకీయ చిత్రం అని మేధావులు మదనపడుతున్నారు. మరోవైపు ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు.. ఈ క్రమంలో పార్టీలు తమ మాటలతో ఓటర్లను ఆకట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు అందరికీ కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ ( KCR) ఒకవైపు.. తెలంగాణ (Telangana) ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలేనని అన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు –నోటుకు సీటు అనే వాళ్లు.. తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని పరోక్షంగా కాంగ్రెస్ (Congress) నేతలని ప్రశ్నించారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలవుట లేవని అక్కడి ప్రజలు బాధపడుతున్నట్టు హరీష్ రావు తెలిపారు. రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడని చెబుతున్నారు.. ఇప్పుడు మేం చేసింది కంప్యూటరీకరణ అని అన్నారు.. రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు.
మరిన్ని తెలుగు రాజకీయ వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !