Telugu News » Harish Rao : ప్రభుత్వంపై పోరాటం చేద్దాం.. ఆటో డ్రైవర్లకు హరీశ్ రావు భరోసా..!

Harish Rao : ప్రభుత్వంపై పోరాటం చేద్దాం.. ఆటో డ్రైవర్లకు హరీశ్ రావు భరోసా..!

రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళమని కానీ, ఇప్పుడు 300 కూడా దాటడం లేదని వెల్లడిస్తున్నారు.. వచ్చే ఈ అరకొర డబ్బులతో ఈఎంఐలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని ఆటో డ్రైవర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

by Venu
brs mla harish rao counters to revanth reddy comments on jobs in telangana

తెలంగాణ (Telangana) ప్రజలకు కష్టాలు మొదలైయ్యాయని బీఆర్ఎస్ (BRS) నేతలు భావిస్తుండగా.. ప్రజా సంక్షేమమే మాధ్యేయం అంటూ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం వెల్లడిస్తుంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పోరులో భాగంగా గులాబీ నేతలు రేవంత్ (Revanth) సర్కార్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు..

Harish Rao: KCR means trust.. Congress means drama: Minister Harish Rao

ఇప్పటికే ప్రభుత్వ పథకాల విషయంలో అసంతృప్తి వెల్లడిస్తున్న హరీష్ రావు (Harish Rao) మరోసారి కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం వల్ల 10 నుంచి 30 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఆటో రిక్షాలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఇష్టపడటం వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళమని కానీ, ఇప్పుడు 300 కూడా దాటడం లేదని వెల్లడిస్తున్నారు.. వచ్చే ఈ అరకొర డబ్బులతో ఈఎంఐలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని ఆటో డ్రైవర్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తాము నడిరోడ్డున పడ్డామని ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఆటో డ్రైవర్ల కష్టాలను శ్రద్ధగా విన్న హరీశ్ రావు, తాముగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరుపున బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో గళం విప్పుతుందని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపిన హరీష్ రావు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరు ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ఉపాధి సాయంగా ప్రభుత్వం నెలకు 10వేలు ఇచ్చేదాక పోరాటం చేద్దామని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment