తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో పెద్ద సమరమే జరుగుతోన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పొందుపరచిన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని …బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని తెలిపిన హరీష్ రావు.. ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని సూచించారు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శ్వేత పత్రాన్ని విడుదల చేసిన క్రమంలో.. హరీష్ రావు (Harish Rao) పలువిమర్శలు చేశారు.. శ్వేత పత్రం పేరుతో తమకు కన్వినెంట్ గా వైట్ పేపరును కాంగ్రెస్ తయారు చేసుకుందని ఆరోపించారు. ఇది కక్ష సాధింపు లెక్కగా ఉందని అన్నారు.
రాష్ట్ర సర్కార్.. శ్వేత పత్రం చూస్తుంటే.. వాస్తవాల వక్రీకరణలా ఉందన్న హరీష్ రావు.. రాజకీయ కక్షల చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా.. అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే కాంగ్రెస్ కి మంచిదని సూచించారు. మరోవైపు ఆర్థిక శ్వేతపత్రం పేజీ 5లో ఉన్న అంశాలపై హరీష్ రావు మండిపడ్డారు.. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ అంచనా వ్యయాలకు సంబంధించి కాగ్ రిపోర్టు చూశామని తెలిపిన హరీశ్‌రావు.. అందులో అన్ని తప్పిదాలే ఉన్నట్టు ఆరోపించారు.
కర్ణాటక బడ్జెట్ అంచనా 2,31,142 కోట్లు ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం 2,31,642 కోట్లుగా చూపించారన్నారని హరీష్ రావు ఆరోపించారు.. వ్యయాల్లో కూడా 2,61,932 కోట్లు అని చూపించారని.. కాగ్ రిపోర్టు ఆధారంగా 2,54,525 కోట్లు ఉందన్నారు హారీష్ రావు. అంటే.. దాదాపు 7 వేల కోట్ల వ్యయాన్ని ఎక్కువగా చూపించారని హరీష్ రావు ఆరోపణలు చేశారు. మొత్తంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ధోరణిలో కాంగ్రెస్ నేతలు కనిపిన్నారని విమర్శించారు..