Telugu News » Harish Rao: ఇది ఆకులు రాలే కాలం.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు..!

Harish Rao: ఇది ఆకులు రాలే కాలం.. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణ(Telangana)లో తిరుగులేని శక్తిగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా దిగజారిపోతోంది. ఆ పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరిగా కారు దిగిపోతున్నారు. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావు(Ex Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఆకులు రాలే కాలం...కొత్త చిగురు మళ్ళీ పార్టీలోకి వస్తుంది’’ అంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

by Mano
Harish Rao: This is the season of falling leaves.. Former Minister Harish Rao's interesting comments..!

తెలంగాణ(Telangana)లో తిరుగులేని శక్తిగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా దిగజారిపోతోంది. ఆ పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరిగా కారు దిగిపోతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే.

Harish Rao: This is the season of falling leaves.. Former Minister Harish Rao's interesting comments..!

ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావు(Ex Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS) నేతలు పార్టీని వీడుతుండటంపై ఆయన స్పందించారు. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు. ‘‘ఇది ఆకులు రాలే కాలం…కొత్త చిగురు మళ్ళీ పార్టీలోకి వస్తుంది’’ అంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని హరీశ్‌రావు విమర్శించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను, కార్యకర్తలను కొనలేరని అన్నారు. మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలో నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు.

అదేవిధంగా పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు. ఇదేం పార్టీకి కొత్తకాదన్న ఆయన తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని అన్నారు. అయినా కేసీఆర్ తెలంగాణ తెచ్చారని గుర్తు చేశారు.

You may also like

Leave a Comment