Telugu News » Bangalore : భారీగా పట్టుబడిన బంగారం.. ఎయిర్ పోర్ట్స్ అడ్డాగా దందా..?

Bangalore : భారీగా పట్టుబడిన బంగారం.. ఎయిర్ పోర్ట్స్ అడ్డాగా దందా..?

మాల్దీవుల (Maldives)నుంచి కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bangalore) కెంపేగౌడ (Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయానికి (International Airport) వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్స్‌ వాష్‌ బేసిన్‌లో 3.2 కిలోల బంగారాన్ని (Gold) అధికారులు గుర్తించి సీజ్‌ (seaze ) చేశారు. ఈ బంగారం విలువ సుమారుగా రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు

by Venu
gold

బంగారం అంటే మక్కువ లేనివారు ఉంటారా.. అందుకే బంగారం పట్ల మనుషులకు ఉన్న వ్యామోహం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో పాటు బంగారం స్మగ్లింగ్ కూడా ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా విమానాశ్రయాలలో పట్టుబడుతున్న బంగారాన్ని చూస్తుంటే మైండ్ గిర్రున తిరిగిపోతుంది అని అనుకోని వారుండరు. తాజాగా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

మాల్దీవుల (Maldives)నుంచి కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bangalore) కెంపేగౌడ (Kempegowda) అంతర్జాతీయ విమానాశ్రయానికి (International Airport) వచ్చిన ఇండిగో విమానం టాయిలెట్స్‌ వాష్‌ బేసిన్‌లో 3.2 కిలోల బంగారాన్ని (Gold) అధికారులు గుర్తించి సీజ్‌ (seaze ) చేశారు. ఈ బంగారం విలువ సుమారుగా రూ.1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా నిందితులు మాల్దీవులు నుంచి అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తున్నట్టు సమాచారం అందిందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు విమానం ఎయిర్‌పోర్టులో దిగగానే కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని గమనించిన నిందితులు ఆ బంగారాన్ని టాయిలెట్స్‌లోని వాష్‌ బేసిన్‌లో పడేశారు. తనిఖీ చేస్తూ వచ్చిన అధికారులకు వాష్‌బేసిన్‌లో 3.2 కిలోల బంగారం దాచిన సంచి కనిపించింది. దొరికిన బంగారు బిస్కెట్లను సీజ్‌ చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.. నిందితుడు మాత్రం ప్రస్తుతానికి తప్పించుకొన్నాడు..

You may also like

Leave a Comment