Telugu News » Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. సముద్రాన్ని తలపిస్తున్న చెన్నై రోడ్లు..!!

Tamil Nadu : తమిళనాడులో భారీ వర్షాలు.. సముద్రాన్ని తలపిస్తున్న చెన్నై రోడ్లు..!!

రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నట్టు సమాచారం.. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నై (Chennai)లో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.

by Venu
rain

ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతోన్నాయి.. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రకృతి ప్రళయానికి విలవిలలాడుతున్న దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి.. అనావృష్టి, అతివృష్టి, భూకంపాలు మొదలగు ఇటువంటి విపత్తులు విరుచుకుపడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా తమిళనాడును (Tamil Nadu) భారీ వర్షాలు (Rain) ముంచెత్తాయి.

Michaung Effect: 'Michang' effect on Telangana.. red alert for those districts..!

రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నట్టు సమాచారం.. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నై (Chennai)లో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగపట్టిణం, కిల్వేలూర్‌ తాళూకా, కుడ్డలూర్‌, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్‌, వెల్లోర్‌, తిరువణ్ణమళైలో.. స్కూళ్లు, కాలేజీకు అధికారులు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కాగా నాగపట్నంలో ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‌పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం వల్ల తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు..

You may also like

Leave a Comment