Telugu News » Hema Malini : రామయ్య సన్నిధిలో ‘డ్రీమ్ గర్ల్’నృత్య ప్రదర్శన…!

Hema Malini : రామయ్య సన్నిధిలో ‘డ్రీమ్ గర్ల్’నృత్య ప్రదర్శన…!

తన నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు.

by Ramu
Hema Malini performs Nritya Seva dance in premises of Ram Mandir

నటి, బీజేపీ (BJP) ఎంపీ హేమామాలిని (Hema Malini) అయోధ్యలో నృత్య ప్రదర్శన చేశారు. ‘రామ మందిర’ ప్రాంగణంలో ఆమె ‘నిత్య సేవ’(Nritya Seva)సంగీత నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. తన నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్‌లో షేర్ చేశారు.

Hema Malini performs Nritya Seva dance in premises of Ram Mandir

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టను కండ్లారా చూడటం తన, అందరి అదృష్టమని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవంతో దేశం మొత్తం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో ‘నృత్య సేవ’ నిర్వహించే అవకాశం కల్పించినందుకు ఆలయ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నటి, ఎంపీ హేమమాలిని చారిత్రక రామమందిరాన్ని శుక్రవారం సందర్శించారు. అక్కడ రాముల వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…. దర్శనం బాగా జరిగిందని చెప్పారు. ఆలయ ట్రస్టు సభ్యులు మంచి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

డ్రీమ్ గర్ల్ హేమామాలిని ‘డ్రీమ్ గర్ల్’, ‘షోలే’, ‘సప్నో కా సౌదాగర్’, ‘సీతా ఔర్ గీతా’…’సత్తే పే సత్తా’ వంటి పలు సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆమెకు పద్మ శ్రీ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 22న నిర్వహించిన రామ్ లల్ల ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

You may also like

Leave a Comment