Telugu News » Hero Suman : రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు..!

Hero Suman : రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు..!

ఓటర్లు డబ్బు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందని అన్నారు. అప్పుడే అవినీతి రాజకీయాలు అంతం అవుతాయని.. నిజమైన ప్రజా సేవకులు మాత్రమే మిగులుతారని వ్యాఖ్యానించారు.

by Venu

టాలీవుడ్ (Tollywood) నటుడు సుమన్ (Actor Suman) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలేనని పేర్కొన్నారు.. ఏపీ (AP)లోని ప్రకాశం జిల్లాలో (Prakasam District) నేడు ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.. ఓటర్లు అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి మాత్రమే ఓట్లు వేస్తున్నారన్నారని తెలిపారు..

ఓటర్లు డబ్బు తీసుకోకుండా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుందని అన్నారు. అప్పుడే అవినీతి రాజకీయాలు అంతం అవుతాయని.. నిజమైన ప్రజా సేవకులు మాత్రమే మిగులుతారని వ్యాఖ్యానించారు. మరోవైపు తాను తెలంగాణ (Telangana)లో ఉంటున్నాను కాబట్టి ఏపీ రాజకీయాలపై మాట్లాడటం సరికాదని సుమన్ పేర్కొన్నారు.. రాష్ట్రం ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు..

మనం వేసే ఒక్క ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపిన సుమన్.. ఓటర్లు ఒక్క సారి నోటు తీసుకొని.. ఐదు సంవత్సరాల వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న విషయాన్ని గమనించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని అన్నారు.. రాజకీయాల్లోకి రావడం వల్ల తనకు పెద్దగా ఉపయోగం కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు.. రాజకీయాల కంటే తనకు సమాజానికి సేవ చేయడమే ముఖ్యమని వెల్లడించారు..

You may also like

Leave a Comment