దేశంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. జాతీయ పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య విమర్శలు అణుబాంబులా విస్పోటనం చెందుతున్నట్లు చర్చించుకొంటున్నారు.. ఇప్పటికే రాహుల్ గాంధీ.. కమలం నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం కనిపిస్తోంది. అయితే తాజాగా బీజేపీ (BJP) నేత, అస్సాం సీఎం ((Assam)) హిమంత బిశ్వ సర్మ (Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో 2026 తర్వాత హిందువులు ఉండరని ఆరోపించారు.. ముస్లింలు సైతం 2032 నాటికి ఆ పార్టీని వదిలి వెళ్తారని జోస్యం చెప్పారు.. కేంద్ర మంత్రి, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం దిడ్రూగఢ్ నుంచి నామినేషన్ దాలకు చేశారు.. అనంతరం బిశ్వశర్మ విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..
దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకొన్నాయని తెలిపారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిన సంఖ్యను చూస్తే.. రాజీవ్ భవన్ వద్ద కుర్చీలు, గదులు ఖాళీగా ఉంటాయి కానీ, వీటిలో ఎవరూ ఉండరని ఆరోపించారు. కాగా గౌహతి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్దేశించి హిమంత వ్యాఖ్యలు చేసినట్లు చర్చించుకొంటున్నారు..
ఇదిలా ఉండగా అస్సాంలో ఏప్రిల్ 19, 26 మరియు మే 7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.. ఈమేరకు రాష్ట్రంలో ఎన్డీయే కూటమి మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలు అసోమ్ గణ పరిషత్ (AGP) రెండు స్థానాల్లో, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL) ఒక చోట పోటీ చేయనున్నట్లు తెలిపాయి..