తెలంగాణ (Telangana) మాజీ సీఎం కేసీఆర్ (KCR) క్రింద పడిపోవడం వల్ల కాలుకి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమ కాలికి యశోద ఆసుపత్రి (Yashoda Hospital) వైద్యులు నిన్న హిప్ రిప్లేస్మెంట్ (Hip replacement) సర్జరీ చేశారు. దీంతో, ఆయనకు దాదాపు ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాలి తుంటికి ఆపరేషన్ తర్వాత.. నడవడానికి కేసీఆర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు కేసీఆర్ దగ్గరే ఉండి.. వాకర్ సాయంతో ఆయనను నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు డాక్టర్లు కేసీఆర్ ను పట్టుకోగా, వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ వీడియోపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. కేసీఆర్‌ను మైక్ రాక్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఆపరేషన్ అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో డిసెంబర్ 7న.. కేసీఆర్ కాలు జారి పడ్డారు. ఎడమ కాలి తుంటి విరగడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 8న రాత్రి డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. అనంతరం ఆపరేషన్ సక్సెస్ అయిందని ప్రకటించారు.