Telugu News » Houthi Rebels: రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు.. ఎదురుదాడికి దిగిన అమెరికా, బ్రిటన్ బలగాలు..!

Houthi Rebels: రెచ్చిపోయిన తిరుగుబాటుదారులు.. ఎదురుదాడికి దిగిన అమెరికా, బ్రిటన్ బలగాలు..!

మరోసారి హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీంతో అమెరికా, బ్రిటన్ బలగాలు(America And British Forces) ఎదురుదాడులకు దిగాయి.

by Mano
Houthi Rebels: Enraged rebels.. American and British forces counterattacked..!

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారుల(Houthi Rebels)పై అమెరికా, బ్రిటన్ బలగాలు(America And British Forces) ఎదురుదాడులకు దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి.

Houthi Rebels: Enraged rebels.. American and British forces counterattacked..!

నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హాతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి మొత్తం 27 వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. మరోసారి హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ దాడులను ఆపాలని హౌతీ తిరుగుబాటుదారులను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి.

కానీ, హౌతీ రెబల్స్ మాత్రం అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మరోసారి దాడులకు దిగింది. హౌతీ రెబల్స్‌కు చెందిన లాజిస్టిక్స్ హబ్లు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల కాష్‌లను లక్ష్యంగా చేసుకోని అమెరికా- బ్రిటన్ దళాలు టోమాహాక్ క్షిపణులు, ఫైటర్ జెట్‌ను ఉపయోగించాయి. ఇక, హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ బలగాలు కలిసి తొలిసారి దాడి చేశాయి.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్ర రాజ్యం.. బ్రిటన్‌తో కలిసి ఈ దాడులను కొనసాగించింది. ఇక, హౌతీ రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రతీకారంగా ఫైటర్ విమానాలతో పాటు 18 డ్రోన్లు, రెండు క్రూయిజ్ క్షిపణులతో పాటు ఒక యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి. గురువారం హౌతీ తిరుగుబాటుదారులు గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు.ఇది ఓ వాణిజ్య ఓడను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఎలాంటి నష్టం జరగలేదు.

You may also like

Leave a Comment