Telugu News » CDP Funds: హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో సీడీపీ నిధుల్లో ఎవరు ఎంత ఖర్చు చేశారంటే….!

CDP Funds: హైదరాబాద్ ఎమ్మెల్యేల్లో సీడీపీ నిధుల్లో ఎవరు ఎంత ఖర్చు చేశారంటే….!

నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేలకు సీడీపీ కింద నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది.

by Ramu
How much mlas spent on devolopment

తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రజల ముందుకు వెళ్తున్నారు. పలు హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఓటర్లు (Voters) సైతం అధికార పార్టీల నేతలను నిలదీస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులపై అధికార నేతలపై పలు చోట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మాట్లాడితే చాలు హైదరాబాద్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టించామంటూ అధికార నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో అభివృద్ది కోసం ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత ఖర్చు చేశారనే అంశంపై చర్చ జరుగుతోంది. కానిస్టెన్సీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(CDP)కింద ఆయా ఎమ్మెల్యేలకు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు చేశారనే విషయాలకు సంబంధించిన నివేదికలపై చర్చలు హాట్ టాపిక్ గా మారాయి.

How much mlas spent on devolopment

నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యేలకు సీడీపీ కింద నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నిధులతో నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి సూచనలు చేసేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. వీటితో నియోజ వర్గాల్లో తాగు నీరు, ప్రజా ఆరోగ్యం, సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు వంటి నిర్మాణాలకు వీటిని ఉపయోగిస్తారు.

వాటిలో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అధికంగా సీడీపీ నిధుల్లో రూ. 8.49 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంఐఎం ఎమ్మెల్యే రూ. 8.93 కోట్లను ఉపయోగించారు. మూడో స్థానంలో ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ మోజమ్ ఖాన్ రూ. 8.61 కోట్లు, నాల్గవ స్థానంలో గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ 6.93 కోట్లు, ఐదవ స్థానంలో సికింద్ర బాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న ర. 6.44 కోట్లు ఉపయోగించారు.

ఆ తర్వాత స్థానాల్లో యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (రూ. 5.96 కోట్లు), జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (రూ. 5.67 కోట్లు), చార్మీనార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ (రూ. 5.67 కోట్లు), చాంద్రాయన్ గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ (రూ. 5.66 కోట్లు), మలక్ పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా (రూ. 5.66 కోట్లు) ఉన్నారు.

ఇక సికింద్ర బాద్ ఎమ్మెల్యే టీ పద్మారావు గౌడ్ (రూ. 5.32 కోట్లు), అంబర్ పేట్ ఎమ్మెల్యే కే. వెంకటేశ్ (రూ. 4.09 కోట్లు), సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (రూ. 4.03 కోట్లు), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (రూ. 3.18 కోట్లు), ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ (రూ. 2,95 కోట్లు) సీడీపీ నిధులు ఖర్చు చేశారు.

You may also like

Leave a Comment