Telugu News » Hyderabad: తెలంగాణ చరిత్రలోనే సంచలనం.. ఆ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది మొత్తం బదిలీ..!

Hyderabad: తెలంగాణ చరిత్రలోనే సంచలనం.. ఆ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది మొత్తం బదిలీ..!

హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta) సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు. ఒకేసారి 85 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

by Mano
Hyderabad: A sensation in the history of Telangana.. Transfer of the entire staff in that police station..!

హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta) సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు. ఒకేసారి 85 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు అందరినీ ఏఆర్‌కు అటాచ్ చేశారు.

Hyderabad: A sensation in the history of Telangana.. Transfer of the entire staff in that police station..!

రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. పంజాగుట్ట పోలీసులపై ముందు నుంచీ పలు ఆరోపణలున్నాయి. కీలక విషయాలను మాజీ ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.

బదిలీలతో పంజాగుట్ట పీఎస్ ఖాళీ అవడంతో ఇతర స్టేషన్‌ల నుంచి 82మంది కొత్త సిబ్బందిని నియమించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు పలు కీలక విషయాలను పంజాగుట్ట పోలీస్ సిబ్బంది గత ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని పసిగట్టిన సీపీ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నిర్ణయం తెలంగాణ చరిత్రలోనే సంచలనంగా మారింది. ఇదివరకు బదిలీల ప్రక్రియ ఒక్కో స్టేషన్‌లో కొందరికే పరిమితం కాగా, ఒకేసారి సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసిన దాఖలాలు లేవు.

You may also like

Leave a Comment