తెలంగాణ (Telangana)లో ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా నగర వాసులకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. నేటి నుంచి ఇవి అమలు కానున్నాయి. ఈ రోజు ఉదయం హైదరాబాద్ (Hyderabad)కు రానున్న మోడీ.. మల్కాజ్ గిరి (Malkazgiri)లో నిర్వహించే విజయ సంకల్ప సభ రోడ్ షోలో పాల్గొననున్నారు.

ఈ బందోబస్తులో కేంద్ర, రాష్ట్రలకు సంబంధించిన పోలీస్ బలగాలు పాల్గొననున్నాయని తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ సీరియస్గా తీసుకొందని తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కమలం నేతలు 12కు పైగా సీట్లు రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఇందులో భాగంగా ప్రచారంలో దూకుడు పెంచారు.. ఇప్పటికే పలు దఫాలు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోడీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.