Telugu News » Hyderabad : పంజాగుట్టలో కారు బీభత్సం.. వీడియో వైరల్..!!

Hyderabad : పంజాగుట్టలో కారు బీభత్సం.. వీడియో వైరల్..!!

ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అయింది. ఇక సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిషాలో ఉన్న వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

by Venu
Road Accident: A terrible road accident.. Nine people died..!

మద్యంసేవించి వాహనాలు నడపడం మీకు మీ తోటి వారికి ప్రమాదకరం.. ఇలాంటి మ్యాటర్ చదవడానికి మాత్రమే పనికోస్తాయి.. ఆచరించడానికి పనికి రావని నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే బడా బాబుల, రాజకీయ వేత్తల బంధుబలగం అర్థరాత్రి మద్యం మత్తులో చేస్తున్న ఆరాచకాలు అధికారులకు తలనొప్పిగా మారగా.. ప్రస్తుతం ఇలాంటి ఘటనే పంజాగుట్టలో చోటుచేసుకొంది.

Road Accident: A van collided with a stationary lorry.. Three died..!

తాజాగా హైదరాబాద్ (Hyderabad) పంజాగుట్ట (Panjagutta)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారుతో అడ్డువచ్చిన వారిని ఢీ కొడుతూ హల్ చల్ చేశాడు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు కారును అడ్డగించి వ్యక్తిని చితకబాదారు. అయితే అతను మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తోన్న విషయాన్ని గమనించిన కొందరు.. ఆ కారును ఆపడానికి ప్రయత్నం చేయగా సదరు వ్యక్తి అలాగే ముందుకు పోనిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వాహనదారులు కష్టం మీద వెంబడించి కారును అడ్డుకొన్నట్టు సమాచారం..

మరోవైపు ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అయింది. ఇక సమాచారం అందుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిషాలో ఉన్న వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో హిట్ అండ్ రన్ కేసు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇప్పటికే ఈ విషయంలో అధికారులు ఎన్ని చర్యలు తీసుకొంటున్న మందుబాబులు దారికి రావడం లేదు.. వారి ర్యాష్ డ్రైవింగ్ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఇలాంటి ఘటనలు నగరంలో సాధారణంగా మారిపోవడం వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment