గుండ్లపోచంపల్లి (Gundlapochampally) మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడ (Maisammaguda)లో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)కి చెందిన యూనివర్సిటీ హాస్టల్‌లో విద్యార్థులకు పురుగుల భోజనం పెడుతున్నారనే విషయం కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ఏబీవీపీ (ABVP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఛైర్మన్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేదని బైఠాయించారు.

లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యం నాణ్యమైన విద్య, భోజనం అందించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. వారు పెట్టిన పరిశుభ్రత లేని భోజనం కారణంగా స్టూడెంట్స్ అస్వస్థతకు గురైన విషయం కూడా బయటకు తెలియకుండా దాస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 7న రాత్రి సమయంలో వర్శిటీ హాస్టల్ భోజనంలో బొద్దింక, బల్లి పడి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే..అయితే ఈ సంఘటన గురించి తెలుసుకొన్న విద్యార్థి సంఘాల నాయకులు గురువారం అక్కడ నిరసన తెలిపారు. దీంతో వారిపై వర్శిటీ సిబ్బంది దాడి చేశారు.