Telugu News » CP Sandeep Shandilya: సీపీ ఆకస్మిక తనిఖీ….. ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు….!

CP Sandeep Shandilya: సీపీ ఆకస్మిక తనిఖీ….. ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు….!

మంగళవారం ఉదయం బోరబండ పోలీసు స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీలు చేశారు.

by Ramu

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్ స్పెక్టర్ (Inspector) పై హైదరాబాద్ సీపీ (CP) సందీప్ శాండిల్య (Sandep Shandilya) సస్పెన్షన్ వేటు వేశారు. మంగళవారం ఉదయం బోరబండ పోలీసు స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా రౌడీ షీటర్ల రికార్డు సరిగా మెయింటెయిన్ చేయడం లేదని బోరబండ ఇన్ స్పెక్టర్ రవి కుమార్ ను సీపీ సస్పెండ్ చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీపీ శాండిల్య మంగళవారం పలు పోలీసు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. బోరబండ పోలీసు స్టేషన్‌ కు వెళ్లిన అక్కడ ఫైల్స్, రౌడిషీటర్ల రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌లో రౌడీ షీటర్ల రికార్డ్ ను సరిగా మెయింటెయిన్ చేయడం లేదని ఇన్ స్పెక్టర్ రవి కుమార్ పై సీపీ ఫైర్ అయ్యారు. స్టేషన్ కు వచ్చే వారి పట్ల సీఐ అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్టు తనిఖీల్లో సీపీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వున్న రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీసేందుకు సీపీ శాండిల్య ఈ రోజు పలు పోలీసు స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బోరబండ పీఎస్ కు వెళ్లి అక్కడ రౌడి షీటర్ల విషయాలను తెలపాలని ఇన్ స్పెక్టర్ ను సీపీ అడిగారు. అయితే ఆ వివరాలు చెప్పడంలో సీఐ విఫలం అయ్యారు.

ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇన్ స్పెక్టర్ రవికుమార్ ను సీపీ ఆఫీసుకు అటాట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సీపీ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తాజాగా సిబ్బందికి ఆయన సంకేతాలు ఇచ్చారు.

You may also like

Leave a Comment