Telugu News » TSRTC: కాసుల వర్షం కురిపించిన దసరా పండుగ.. టీఎస్‌ఆర్టీసీ లాభం ఎంతంటే..!

TSRTC: కాసుల వర్షం కురిపించిన దసరా పండుగ.. టీఎస్‌ఆర్టీసీ లాభం ఎంతంటే..!

విశాఖపట్టణం, విజయవాడ, చెన్నయ్, బెంగళూరు, వంటి ప్రాంతాలకు వెళ్లే వారు డైనమిక్ ఫేర్ ను ఎక్కువగా వినియోగించుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపారు.

by Venu

దసరా (Dussehra) పండగ వచ్చిందంటే చాలు తెలంగాణ (Telangana) ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తుంది. పండుగల సమయాల్లో ప్లానింగ్ తో ఉన్న టీఎస్‌ఆర్టీసీ ఈ దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను నడిపి భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. తెలంగాణతో పాటు ఏపీ (AP) కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను నడిపిన టీఎస్‌ఆర్టీసీ (TSRTC)కి సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా గతంలో డైనమిక్‌ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ దసరా పండుగ సందర్భంగా ఇవి ప్రస్తుతం ఆర్టీసీ ఆదాయం పెరగడానికి తోడ్పడ్డాయి.. అయితే ప్రయాణికులు తక్కువ ఉన్న సమయంలో తక్కువ ఛార్జీలు, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడమే డైనమిక్‌ ఫేర్‌ ఉద్దేశం.

మరోవైపు విశాఖపట్టణం, విజయవాడ, చెన్నయ్, బెంగళూరు, వంటి ప్రాంతాలకు వెళ్లే వారు డైనమిక్ ఫేర్ ను ఎక్కువగా వినియోగించుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడానికి ఆసక్తి చూపారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం 10 రీజియన్లు ఉన్నాయి. కాగా ఒక్కో రీజియన్‌కు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరిందని టీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.. ఇక దసరా పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు అంటే 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపించింది..

You may also like

Leave a Comment