Telugu News » Hyderabad : విద్యార్థినుల సూసైడ్ పై అబిడ్స్‌లో నెలకొన్న హై టెన్షన్..!

Hyderabad : విద్యార్థినుల సూసైడ్ పై అబిడ్స్‌లో నెలకొన్న హై టెన్షన్..!

భువనగిరి, సూర్యాపేట, గురుకుల కాలేజీ.. మాదాపూర్, నారాయణ ఐఐటి అకాడమీలో.. జరిగిన ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సోమవారం ఉదయం.. స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో.. అబిడ్స్‌ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు.

by Venu

తెలంగాణ (Telangana)లో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆగడం లేదు. కాలేజీ, స్కూల్ అనే తేడా లేకుండా విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలా గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల భువనగిరి (Bhuvanagiri) గురుకుల హాస్టల్‌లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థినులు ఒకే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే.. తాజాగా మరో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యపేట (Suryapet)లోని ఇమాంపేట (Imampeta) గురుకుల హాస్టల్‌లో వైష్ణవి అనే ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సూసైడ్ చేసుకొంది. కాగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో జరుగుతోన్న విద్యార్థినుల వరుస ఆత్మహత్యలపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అబిడ్స్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది.

భువనగిరి, సూర్యాపేట, గురుకుల కాలేజీ.. మాదాపూర్, నారాయణ ఐఐటి అకాడమీలో.. జరిగిన ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సోమవారం ఉదయం.. స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో.. అబిడ్స్‌ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. రోడ్డు‌పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో.. పోలీసులు, విద్యార్థుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో, పోలీసులు నిరసన కారులను చెదరగొట్టి, వారిని అరెస్టు చేసి, అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఇప్పటికే జిల్లా కేంద్రానికి చెందిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలని వివిధ పార్టీలు, పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే..

You may also like

Leave a Comment