Telugu News » Hyderabad : పీర్జాదిగూడలో హై టెన్షన్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత..!

Hyderabad : పీర్జాదిగూడలో హై టెన్షన్.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత..!

కొందరు భాదితులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని తెలియకుండా మోసపోయి కొన్నారు. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవో‌తో వీరి సమస్యలు తొలగి పొతాయాని భావించారు..

by Venu

ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు.. గతప్రభుత్వ హయాంలో భారీగా కబ్జాలు చోటు చేసుకొన్నాయనే ఆరోపణలున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. వాటిని గుర్తించి కూల్చివేస్తున్నారు. తాజాగా మేడ్చల్ (Medchal) జిల్లా మేడిపల్లి (Medipalli) మండలం పీర్జాదిగూడ (Pirjadiguda) మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకొంది.

పర్వతాపూర్ సాయిప్రియా కాలనీ సర్వే నంబరు 1, 10,11 సీలింగ్ స్థలంలో వెలసిన నివాసా సముదాయాలను మంగళవారం తెల్లవారు జామున రెవెన్యూ అధికారులు.. పోలీసు బందో బస్త్ మధ్య పలు నివాసాలను నేలమట్టం చేశారు. అక్కడ ఉన్న మొత్తం 15 ఎకరాల స్థలంలో దాదాపు 300 వందలకు పైగా ప్లాట్లు ఉన్నాయి. అయితే కోర్టు పరిధిలో ఉన్న 70 ఇళ్లను అధికారులు ముట్టుకోలేదు.

అయితే ప్రభుత్వ భూమిలో కూల్చివేతలు చేపట్టగా అప్పుడు కొందరు బాధితులు అడ్డుకొని కోర్టు‌ను ఆశ్రయించారు. కోర్టు కేసు ఉన్నవాటిని కాకుండా మిగతా వాటిని మంగళవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. గతంలో ఇంటి నంబర్లు ఇస్తామంటే చందాలు వేసుకుని కొందరికి కోట్లలో డబ్బు ముట్ట జెప్పామని తక్షణమే కొత్త ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని.. జీవో 118ను సవరించి తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.

ఇదిలా ఉండగా కొందరు భాదితులు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని తెలియకుండా మోసపోయి కొన్నారు. అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 118 జీవో‌తో వీరి సమస్యలు తొలగి పొతాయాని భావించారు.. కానీ అప్పటికే సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణంలో ఉన్నవాటికి మాత్రమే 118 జీవో అమలవుతుందని తెలపడంతో.. కొందరు వారు కొన్న సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణాలు చేపట్టారు.

You may also like

Leave a Comment