Telugu News » Hyderabad : హైదరాబాద్ నగర శివార్లపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం.. పూర్తిగా మారనున్న రూపురేఖలు..!!

Hyderabad : హైదరాబాద్ నగర శివార్లపై హెచ్ఎండీఏ కీలక నిర్ణయం.. పూర్తిగా మారనున్న రూపురేఖలు..!!

ఈ అంశంపై గత ప్రభుత్వానికి అధికారులు తమ ప్రతిపాదనను వెల్లడించారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల పనులు ముందుకు సాగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వస్తోంది.

by Venu
hmda lands

హైదరాబాద్ (Hyderabad) విశ్వనగరంగా మారుతోన్న నేపథ్యంలో ఎన్నో మార్పులు చోటుచేసుకొంటున్న విషయం తెలిసిందే.. ఐటీ కంపెనీలకు, ముఖ్యంగా టెక్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నగరంలో నివసించే వారిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అదీగాక దేశం నలుమూలల నుంచి ఉపాధికోసం ఎందరో నిత్యం వలస రావడం వల్ల రోజు రోజుకు హైదరాబాద్ జనాభా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

Heavy Rain Effect in hyderabad 1

అయితే ప్రస్తుతం ఉన్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం ఎక్కువగా ఏర్పడటం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొనినగరం పై ఒత్తిడి తగ్గించేందుకు హెచ్ ఎండీఏ (HMDA) ప్రణాళికలు రచిస్తోంది.. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర శివార్లలో మినీ సిటీల నిర్మాణానికి సిద్ధమైంది.

ఇప్పటికే ఈ అంశంపై గత ప్రభుత్వానికి అధికారులు తమ ప్రతిపాదనను వెల్లడించారు. కానీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల పనులు ముందుకు సాగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వస్తోంది. శివార్లలో కొత్త నగరాల (New Cities)ను నిర్మించడం వల్ల రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని, ప్రజా రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయని భావిస్తున్నారు..

ఈ క్రమంలో నగర శివార్లలోని 11 ప్రాంతాల్లో మినీ సిటీలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో ఇబ్రహీం పట్నం, తుర్కపల్లి ప్రాంతాలను మినీ సిటీలుగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో బ్యాంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్ కు రావాల్సిన అవసరం తగ్గుతుందని భావిస్తున్నారు.. ఈ ప్రణాళిక అమలైతే నగర శివారుల రూపురేఖలు పూర్తిగా మారనున్నట్లు తెలుస్తోంది..

You may also like

Leave a Comment