Telugu News » Hyderabad : హెచ్‌ఎండీఏ శివబాలకృష్ణ అవినీతిపై బిగుస్తున్న ఉచ్చు.. కీలక నిర్ణయం దిశగా అధికారులు..!!

Hyderabad : హెచ్‌ఎండీఏ శివబాలకృష్ణ అవినీతిపై బిగుస్తున్న ఉచ్చు.. కీలక నిర్ణయం దిశగా అధికారులు..!!

ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్ల ఆస్తులు సంపాదించారంటే అవినీతి ఏ స్థాయిలో చేశారో అర్థం అవుతోందని అనుకొంటున్నారు.. అయితే ఏకకాలంలో 17 చోట్ల సోదాలు జరిపిన అధికారులు రూ.కోట్లు విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

by Venu

హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన అవినీతి అనకొండను అధికారులు అరెస్టు చేసిన విషయ తెలిసిందే. రేరా కార్యదర్శిగా ఉన్న శివబాలకృష్ణ (Shiva Balakrishna) నివాసాల్లో ఏసీబీ (ACB) తనిఖీలు నిర్వహించగా భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. హైదరాబాద్ (Hydreabad) మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం (Hmda) డైరెక్టర్‌గా, రేరా కార్యదర్శిగా పని చేస్తున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసిన వారు ముక్కున వేలేసుకొంటున్నారు.

HMDA Former Director Shiva Balakrishna 45 Pages Remand Report

ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్ల ఆస్తులు సంపాదించారంటే అవినీతి ఏ స్థాయిలో చేశారో అర్థం అవుతోందని అనుకొంటున్నారు.. అయితే ఏకకాలంలో 17 చోట్ల సోదాలు జరిపిన అధికారులు రూ.కోట్లు విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఏసీబీ అధికారులకు సైతం దిమ్మదిరికే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. దీంతో వాటి వివరాలు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.

మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్న శివబాలకృష్ణ.. పలువురు బినామీ పేర్లతో వాటిని సంపాదించినందున, ఆ వివరాలను రాబట్టేందుకు పోలీసు కస్టడీ తీసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం.. అదీగాక బినామీలతో పాటు బాలకృష్ణ అవినీతికి సహకరించిన ఇతర అధికారుల పాత్రపైనా అనుమానాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహాకారంతోనే కోట్లకు పడగలెత్తినట్లు భావిస్తున్నారు..

ఈమేరకు త్వరలో వారికి కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 45 పేజీల రిమాండ్ రిపోర్టులో బాలకృష్ణకు సంబంధించిన ఆస్తులు, అక్రమంగా ఆర్జించడానికి అనుసరించిన విధానాలను ఏసీబీ ప్రస్తావించింది. మరోవైపు బాలకృష్ణపై చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. సర్వీసు నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు.. న్యాయ సలహా తీసుకుంటున్నట్లుగా సమాచారం.

You may also like

Leave a Comment