Telugu News » Hyderabad : నగరంలో భయానక ఘటన.. బైక్‌ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్..!

Hyderabad : నగరంలో భయానక ఘటన.. బైక్‌ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్..!

జరుగుతున్న ఘటనను గమనించిన ఓ కారు డ్రైవర్ ఇదంతా వీడియో తీశాడు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా లారీ ఆపాలని డ్రైవర్‌కి సూచించిన వినకుండా మరింత స్పీడ్‌ పెంచారన్నారు..

by Venu
Road Accidents: Fatal accidents.. 10 people died..!

గాలిలో దీపం పెట్టి నిశ్చలంగా ఉండమంటే ఉంటుందా.. మనిషి జీవితం కూడా అంతే.. బ్రతుకు ప్రయాణంలో చేసే పోరాటంలో ఎప్పుడు మృత్యువు.. ఏ రూపంలో పలకరిస్తుందో తెలుసుకోవడం అసంభవం.. కానీ ఇంకా నూకలు బాకీ ఉంటే కొందరు బతికి బట్టకట్టడం కనిపిస్తోంది.అలాగే అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు అతి భయంకరంగా ఉండటం కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ భయానక సంఘటన పాతబస్తీ (Old City)లో చోటుచేసుకొంది.

కానీ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.. ఇక మ్యాటర్ లోకి వెళ్ళితే.. ఓ లారీ డ్రైవర్ (Lorry Driver) బైక్‌ (Bike)ని ఢీ కొట్టడమే కాకుండా రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దృశ్యాలకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది. ముందు వెళ్తున్న బైక్‌కి వెనుక వస్తున్న లారీ తగిలింది. ఈ ప్రమాదంలో బైక్ లారీ కింద ఇరుక్కుపోయింది. దీంతో బైకర్, లారీ ఫుట్ బోర్డ్ ఎక్కి డోర్ పట్టుకొని డ్రైవర్‌తో గొడవకి దిగాడు..

అయితే ఆ డ్రైవర్ లారీ ఆపకుండా అలాగే తీసుకువెళ్ళాడు.. బైకర్ లారీ బ్యానెట్‌పైనే నిల్చొని ఆర్థనాదాలు చేసిన ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. అలా దాదాపు రెండు కిలోమీటర్ల లారీ ఆపకుండా వేగంగా పోనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే జరుగుతున్న ఘటనను గమనించిన ఓ కారు డ్రైవర్ ఇదంతా వీడియో తీశాడు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా లారీ ఆపాలని డ్రైవర్‌కి సూచించిన వినకుండా మరింత స్పీడ్‌ పెంచారన్నారు..

ఈ క్రమంలో ఒకచోట రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ అగింది. వెంటనే బైకర్ దిగిపోయాడు. అయితే వీడియో ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్‌ను పట్టుకొన్నారని సమాచారం.. కాగా అదృష్టం బాగుంది కాబట్టి బైకర్ బ్రతికాడు.. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ డ్రైవర్ కి బుద్ధి వచ్చేలా శిక్షించాలని కామెంట్స్ పెడుతున్నారు..

You may also like

Leave a Comment