ప్రస్తుత సమాజంలో మాటలు చెప్పేవారు ఎక్కువైయ్యారు.. మంచిని ఆచరించేవారు తక్కువైయ్యారు అని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక మానవత్వం గురించి గంటలు గంటలు స్పీచ్ ఇచ్చేవారు అది చూపించే సమయం వచ్చినప్పుడు ముఖం చాటేయడం కనిపిస్తుంది. మొత్తానికి నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా మంటగలిసి పోయిందనడానికి ఈ ఘటన చాలు అని కొందరు అంటున్నారు.. ఇంతకు ఏం జరిగిందంటే..
రోడ్డుప్రమాదంలో నిన్న సాయంత్రం ఓ జవాన్ మృతి చెందారు.. ఈ విషాద ఘటన నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకొంది. హైదరాబాద్ (Hyderabad), గోల్కొండ (Golconda) ఆర్టిలరీ కేంద్రంలో విధులు నిర్వహించే కునాల్ అనే ఆర్మీ జవాన్ (Army jawan), నార్సింగి (Narsinghi) వద్ద నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు.
నడిరోడ్డుపై అతని మృత దేహం గంటల తరబడి అలానే పడి ఉందని తెలుస్తోంది. అయితే ప్రజల కోసం సేవ చేసే ఒక జవాన్ నడి రోడ్డుపై చనిపోయి ఉన్న అటుగా వెళ్తున్న ఒక్కరు కూడా పట్టించుకోన్న పాపాన పోలేదని తెలుస్తోంది. రోడ్డుపై అటుగా ఎన్నో వాహనాలు వెళ్తున్న ఒక్కటి కూడా ఆపకూండా అలాగే చూస్తూ వెళ్లిపోయారు. తప్ప మృతి చెందిన జవాన్ శరీరాన్ని పక్కకు తీసే ప్రయత్నం గానీ.. కనీసం అధికారులకు సమాచారం ఇద్దామనే ఆలోచన కూడా ఏ ఒక్కరూ చేయలేదు.
నిజమైన మానవత్వం ఉన్న వారి మనస్సును ఈ దృశ్యం కంటనీరు పెట్టించేలా ఉంది. అయితే ఎవరో వీడియో మాత్రం తీశారు.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. సమాజంలోని మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మానవత్వం మరుగున పడిపోయిందని, ప్రస్తుతం ఉన్న సొసైటీని చూస్తుంటే సిగ్గేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు..