Telugu News » Hyderabad : కంటెంట్ నచ్చితే చాలు సినిమాలోపల ఉన్న కటౌట్లు అవసరం లేదు..!

Hyderabad : కంటెంట్ నచ్చితే చాలు సినిమాలోపల ఉన్న కటౌట్లు అవసరం లేదు..!

ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్ తో అంత మంచి అవుట్ ఫుట్ తీసుకొని రావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని కుమారస్వామి అన్నారు..

by Venu

నూతన నటి నటులతో నందు యార్లగడ్డ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘హర హర’.. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని.. శ్రీనగర్ కాలనీ (Srinagar Colony), శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి (Dundra Kumaraswamy) హాజరయ్యారు. KK మీడియా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్ ను దుండ్ర కుమారస్వామి ఘనంగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగు వాళ్లకు సినిమాలు అంటే ఎంతో ప్రాణం. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ఆలోచించరు. కంటెంట్ నచ్చితే చాలు సినిమాలోపల ఉన్న కటౌట్లు పట్టించుకోరన్నారు.. నచ్చినన్ని సార్లు సినిమాను చూడటానికి కూడా ఆలోచించరని తెలిపారు.. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో చిన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారన్నారు..

ఇప్పుడు ఆ కోవలోకి వస్తున్న సినిమా ‘హర హర’ అని తెలిపారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. ఇంత తక్కువ బడ్జెట్ తో అంత మంచి అవుట్ ఫుట్ తీసుకొని రావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని కుమారస్వామి అన్నారు.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారని ఆశిస్తూన్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకొని.. నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని.. ఇంకొన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకొంటున్నట్లు తెలిపారు..

చిత్ర డైరెక్టర్ నందు మాట్లాడుతూ ఈ సినిమా శివుడికి సంబంధించింది కాబట్టి.. ఆ పరమ శివుడి ఆశీస్సులు కూడా మా పై ఉంటాయిని ఆశిస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందిని భావిస్తున్నట్లు వెల్లడించారు.. కాగా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కిరణ్.. డైరెక్టర్ నందు యార్లగడ్డ (Nandu Yarlagadda), బలగం ఫేమ్ (Balagam fame) రూపలక్ష్మి (Rupalakshmi), సంగీత దర్శకుడు ఎమ్మెల్ రాజా.. హీరో కిరణ్, హీరోయిన్ రామ ఆజ్యశ్రీ.. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment