ఒకవైపు ఈడీ (ED) దూకుడు పెంచగా, ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఐటి (IT) అధికారులు కూడా వేగం పుంజుకొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని (Hyderabad) అమీర్ పేట (Ameer Peta), కూకట్ పల్లి (Kukat Palli), శంషాబాద్ లో (Shamshabad) ఉన్న చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఐటీ దాడులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
గత మూడు రోజులనుండి సోదాలు నిర్వహిస్తున్నారు. పూజ కృష్ణ ఎండీ కృష్ణ ప్రసాద్ ఇల్లు ఆఫీసు, శంషాబాద్ రఘువీర్ ఇల్లు, ఇందు ఫార్చ్యూన్ సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. కాగా కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆయా సంస్థలు ఆదాయ పన్ను చెల్లించలేదనే సమాచారంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులను పెట్టారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ సోదాల్లో చెన్నైకి చెందిన ఆదాయపన్ను శాఖ బృందాలు సైతం పాల్గొన్నట్టు సమాచారం. కాగా పూజాకృష్ణ సంస్థకు కృష్ణప్రసాద్ దొప్పలపూడి మేనేజింగ్ డైరెక్టర్‌గా, సోమేపల్లి నాగరాజేశ్వరి, దొప్పలపూడి పూజాలక్ష్మి డైరెక్టర్లుగా ఉన్నారు.