Telugu News » KTR : ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందు ఉంది..!!

KTR : ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందు ఉంది..!!

హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు (RYTHU BANDU) కటాఫ్​ విషయంలో పరిశీలన చేస్తామని తెలిపారు.

by Venu
KTR

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓటర్ల నాడీ పట్టుకునే ప్రయత్నంలో హామీల వరాలు గుప్పిస్తున్నారు. మరి ఓటర్లు వీరి గాలానికి చిక్కారో లేదో తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వచ్చేవరకు వెయిట్ చేయవలసిందే.. సామాన్యంగా ఓటర్లు రాజకీయ నేతల వ్యూహాలకు కూడా అంత ఈజీగా చిక్కరన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికి అధికార పగ్గాలు అప్పగిస్తారో అనే ఆసక్తి తెలంగాణలో నెలకొంది.

మరోవైపు హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు (RYTHU BANDU) కటాఫ్​ విషయంలో పరిశీలన చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కువ భూమి ఉన్న రైతులకి ఎక్కువ రైతుబంధు రావడం.. తక్కువ ఉన్న అన్నదాతలకు తక్కువ రావడం తన దృష్టికి వచ్చిందని అన్నారు.. దీనివల్ల రైతులు పడుతున్న ఇబ్బంది గమనించినట్టు కేటీఆర్‌ (KTR) తెలిపారు.

పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామన్న కేటీఆర్‌.. ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, పవర్ లాంటి సంస్థల్లో పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి పెడుతోందని పేర్కొన్నారు. మోదీ (PM MODI) 118 కోట్లు అప్పు చేశారని విమర్శించిన కేటీఆర్‌.. బీజేపీతో పొత్తు అనే మాట బీఆర్‌ఎస్‌ కు పడదన్నారు..

మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా ట్రైలర్ మాత్రమే చూపించామని.. అసలు సినిమా ఇంకా చాలా ఉందని కేటీఆర్ అన్నారు.. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలంగాణకు వచ్చినప్పుడు అయనకు స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వక అబాసుపాలు చేశారని కాంగ్రెస్ ని ఎద్దేవా చేశారు..

You may also like

Leave a Comment