ప్రజా సేవకోసం ఏర్పరచుకున్న ఉద్యోగం పేరు రాజకీయం.. కానీ నేడు ఆక్రమంగా డబ్భులు సంపాదించడానికి ఏర్పడిన రాచ మార్గంలా రాజకీయం మారిందని మేధావులు ఇప్పటికే మధనపడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఎన్నికల సమయంలో బయట పడుతున్న నోట్ల కట్టలను చూపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు పట్టుబడుతుంది.
ఈనెల 30న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్రం అంతటా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చెక్‌పోస్టులు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రూ.570 కోట్లకు పైగా విలువైన డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదీగాక ఓటర్లకు పంచడానికి సిద్దంగా ఉన్న తాయిలాలను కూడా సీజ్ చేశారు.
రాష్ట్రంలో ఇలా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్న డబ్బుల కట్టలు రోడ్లపై పరిగెత్తించడం ఆగడం లేదు. ఏదో ఒక మార్గంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరోసారి భారీగా నగదు పట్టుకున్నారు.. నగదును హైదరాబాద్ (Hyderabad) నుంచి ఖమ్మం (Khammam)తరలిస్తుండగా.. అప్పా జంక్షన్ (Appa Junction) దగ్గర పోలీసులు రూ.6.5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన కీలక కాంగ్రెస్ నేతకి చెందినట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరోవైపు ఆ డబ్బును ఆరు కార్లలో తరలిస్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కార్లను సీజ్ చేశారు. ఇక ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే ఈ డబ్బులు తరలిస్తున్నారని భావిస్తున్నారు.