Telugu News » Hyderabad : ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సర్పంచులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

Hyderabad : ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సర్పంచులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

తమని పట్టించుకోకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని వెల్లడించిన సర్పంచులు.. పార్లమెంట్ ఎన్నికల్లోపు తమ బిల్లులు చెల్లించక పోతే కాంగ్రెస్ అభ్యర్థులను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.

by Venu

గత పాలకుల తప్పిదమో.. నిర్లక్ష్యమో కానీ ప్రస్తుతం సర్పంచులుగా ఉన్నవారి బ్రతుకులు రోడ్డుపాలు అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS) పాలనలో గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేపించిన సర్పంచులకు గత ప్రభుత్వం హ్యాండిచ్చింది.. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలంటూ అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు

గత ప్రభుత్వ హయాంలో తమ మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించుకొన్న అధికారులు.. బిల్లుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ సమస్యలపై ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు.. అదీగాక సీఎం రేవంత్ (CM Revanth)కు, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు విన్నవించాము. అయినా ఇంత వరకు వారినుంచి స్పందన కరువైందని వాపోయారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే బిల్లులు రాక.. చేసిన అప్పులు కట్టలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకొన్నారు. కనీసం మిగతా సర్పంచులైనా ఆత్మహత్య (Suicide) చేసుకోకుండా వారికి మనో ధైర్యం కలిగించేందుకు గన్ పార్క్ (Gun Park) వద్ద ధర్నా చేపట్టామని వెల్లడించారు. పెండింగ్ బిల్లులు వచ్చే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తామని హెచ్చరించారు.

తమని పట్టించుకోకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని వెల్లడించిన సర్పంచులు.. పార్లమెంట్ ఎన్నికల్లోపు తమ బిల్లులు చెల్లించక పోతే కాంగ్రెస్ అభ్యర్థులను గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సర్పంచులు అసెంబ్లీ ముందు బైటాయించే ప్రయత్నం చేయడంతో వారిని అడ్డుకొన్న పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు..

You may also like

Leave a Comment