ఒక మనిషి ఎలాగైతే జీవించకూడదని అనుకుంటాడో.. అదే దారిలో మనిషిని, మనస్సును నడిపించేలా మాదక ద్రవ్యాలు ప్రేరేపిస్తున్న సంగతి తేలిసిందే.. కాగా నగర యువత ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.. ఇప్పటికే నగరం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిపోయిందని అంటున్నారు. ఈ క్రమంలో సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా హైదరాబాద్ (Hyderabad)లోని సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Narcotics Bureau)పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్ (Methamphetamine)..700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు..
ఈమేరకు పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలుగా (Rs 50 Lakh) ఉంటుందని నార్కోటిక్స్ ఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన నిందితుడుగా కమ్మ శ్రీనివాస్‌ను గుర్తించామని.. ఇతను డ్రగ్స్ తయారీలో కీలక వ్యక్తి అని ఎస్పీ తెలిపారు. కాగా గాజుల రామారంలో ఉంటున్న శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. ఈ చీకటి దండాకు పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు. పట్టుబడిన మరో ఇద్దరిలో కాకినాడ ప్రాంతానికి చెందిన మణికంఠ.. ఓ కంపెనీలో సూపర్ వైజర్ కం డ్రైవర్‌గా పని చేస్తున్న నరసింహ రాజు అని అధికారులు వెల్లడించారు.
మరోవైపు కమ్మ శ్రీనివాస్ ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారీ చేస్తూ 2013లో.. ఎన్‌సీబీ అధికారులకు దొరికి జైలుకు వెళ్ళినట్టు వెల్లడించిన అధికారులు.. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకి వచ్చి, నరసింహ రాజు, మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారని వివరించారు. కాగా ముగ్గురు నిందితులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ తెలిపారు..