తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ వెలువడ్డాయి. కాంగ్రెస్ (Congress) పూర్తి ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటి రాష్ట్ర అధికారం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ (KTR) ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ఓ ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా బీఆర్ఎస్ (BRS)కు వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చారు. అందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.. ఈ ఎన్నికల్లో మాత్రం తాము ఆశించిన ఫలితం రాలేదని. కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిజేస్తున్నట్టుగా కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.
ఇంత వరకు బాగానే ఉన్న బుల్లితెర యాంకర్ అనసూయ (Anchor Anasuya) ఈ ట్వీట్ పై స్పందించడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మీరు నిజమైన నాయకుడు సార్.. ఎందరికో స్పూర్తినిస్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి వల్ల నేను హైదరాబాద్‌తో మళ్లీ ప్రేమలో పడ్డాను.. ధన్యవాదాలు అంటూ అనసూయ రిప్లై ఇవ్వడం వైరల్ గా మారింది.
అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు భగభగ మండిపడుతున్నారు. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. థ్యాంక్యూ ఆంటీ, చెప్పింది చాలు, హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చేస్తే సరిపోదని ముందు తెలుసుకో ఆంటీ అని కొందరు.. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి, అసలు నువ్వు ఓటేశావా? అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం సోషల్ మీడియాలో నెటిజనుల ట్రోలింగ్ అధికమైంది.