క్రికెట్ వరల్డ్ కప్ టైమ్ స్టార్ట్ అయ్యింది. అప్ డేట్స్ కోసం క్రికెట్ అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇంటర్ నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(ICC) తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆటగాళ్లకు కీలకంగా మారనుంది.
అయితే ఈ క్రమంలో ఐసీసీ తాను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది.తొమ్మిది మ్యాచ్ లను రీషెడ్యూల్ చేస్తున్నట్టు తెలిపింది.దీంట్లో భాగంగా అహ్మదాబాద్‌లో 15వ తేదీన జరగాల్సిన భారత్ -పాకిస్థాన్ మ్యాచ్(IND VS PAK match)..ఒకరోజు(అక్టోబరు 14వ తేదీ) ముందే జరగనుందని పేర్కొంది.
*అక్టోబర్ 14న దిల్లీ( Delhi) వేదికగా జరగాల్సిన ఇంగ్లాండ్-అప్ఘానిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
*అక్టోబర్ 12న హైదరాబాద్( Hyderabad) వేదికగా శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 10న నిర్వహించనున్నారు.
*అక్టోబర్ 13 శుక్రవారం లఖ్‌నవూ( Lakhanpur) వేదికగా నిర్వహించాల్సిన ఆస్ట్రైలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ను అక్టోబర్ 12న జరగనుంది.
*అక్టోబర్14న చెన్నై(Chennai) వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్..అక్టోబర్ 13న డే అండ్ నైట్ కంటెస్ట్‌గా నిర్వహించనున్నారు.
*ధర్మశాల(Dharmasala ) వేదికగా నవంబర్ 11న ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్.. అదే రోజు నవంబర్ 11 డే మ్యాచ్ (10:30)గా నిర్వహించనున్నారు.
*పుణె( Pune) వేదికగా నవంబర్ 12న జరగాల్సిన ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 11న ఉదయం 10.30 గంటలకు జరగనుంది.
*కోల్‌కతా( Kolkata) వేదికగా నవంబర్ 12న జరగాల్సిన ఇంగ్లాండ్-పాకిస్థాన్ మ్యాచ్ నవంబర్11న మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది.
*బెంగళూరు(Bengaluru) వేదికగా టీమ్ఇండియా లాస్ట్ లీగ్ గేమ్.. నవంబర్ 11 నుంచి నవంబర్ 12వ తేదీకి మారింది. ఇందులో భారత్..నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
భారత్ వేదికగా ఈ వన్డే వరల్డ్ కప్ జరగనుంది.ఈ మెగా సమరం అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగియనుంది. ఈ టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్..రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది.