Telugu News » Harish Rao : ఆ పార్టీని నమ్ముకుంటే వెన్నుపోటు ఖాయం.. హామీల కోసం చూస్తే గుండెపోటు రావడం నిజం..!!

Harish Rao : ఆ పార్టీని నమ్ముకుంటే వెన్నుపోటు ఖాయం.. హామీల కోసం చూస్తే గుండెపోటు రావడం నిజం..!!

తెలంగాణ (Telangana)లో నేను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి కేసీఆర్‌ తీసుకొచ్చారన్న హరీశ్​రావు.. కాంగ్రెస్ ను నమ్ముకుంటే వెన్నుపోటు ఖాయం.. ఇచ్చిన హామీల కోసం చూస్తే గుండెపోటు రావడం నిజం అని ఎద్దేవా చేశారు.

by Venu

కాంగ్రెస్ ను విమర్శించే అవకాశం వస్తే మొదటి వరసలో ఉండేది కేటీఆర్ (KTR)..హరీశ్​ రావు అని జనం అనుకుంటున్నారు. ఇప్పటికే మాటలకు అందని విధంగా హస్తాన్ని ఆటాడుకుంటున్న ఈ మంత్రులు.. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పేరు పలకని రోజు లేదని జనం ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్​ రావు మరోసారి కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు.

కన్నడ ప్రజలకు ఆరు నెలల క్రితం అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్​ (Congress) నేతలు.. ఇప్పుడేమో​ నరకం చూపిస్తున్నారని హరీశ్​రావు విమర్శించారు. నోటికి ఏది వస్తే అదే హామీలుగా ఇచ్చిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్​ గాంధీ.. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా కూడా కర్ణాటక వెళ్లలేదని హరీశ్​రావు అన్నారు. దిల్లీ నేతల హామీలను నమ్ముకున్న కర్ణాటక ప్రజలు ఆరు నెలల క్రితం చేసిన తప్పుకు.. ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ హామీని మరచిపోయిందన్నారు హరీశ్​ రావు (Harish Rao).. ఉన్న పథకాలకే కోత పెడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ రోడ్లు వేయడానికే డబ్బులు లేవని డీకే శివకుమార్‌ అన్న విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్​ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని విమర్శించారు.

తెలంగాణ (Telangana)లో నేను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి కేసీఆర్‌ తీసుకొచ్చారన్న హరీశ్​రావు.. కాంగ్రెస్ ను నమ్ముకుంటే వెన్నుపోటు ఖాయం.. ఇచ్చిన హామీల కోసం చూస్తే గుండెపోటు రావడం నిజం అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కానీ తెలంగాణలో ప్రతి పల్లెలోను నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయన్న హరీష్ రావు.. రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

You may also like

Leave a Comment